ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా నయా చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లను పడగొట్టాడు. దీంతో డబ్లూటిసి టోర్నమెంట్‌లో రికార్డు స్థాయిలో 12 సార్లు వికెట్ల ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న 11 సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన రికార్డును తిరగరాశాడు.
బుమ్రా ఈ సీజన్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను పడగొట్టడం ఇది రెండోసారి. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రా ఆరు వికెట్లను పడగొట్టాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో 74 పరుగులకు ఐదు వికెట్లను పడగొట్టి రికార్డు సృష్టించాడు. అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్‌లు పదేసి సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించారు. వీరి నుంచి బుమ్రాకు పోటీ నెలకొంది.