లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొట్టాడు. కీలక వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. 251/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఆరంభంలోనే షాక్ తగిలింది. జో రూట్ సెంచరీ సాధించిన కొంత సమయానికే బెన్ స్టోక్స్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత తాను వేసిన ఓవర్‌లో బుమ్రా జో రూట్‌ని, ఆ తర్వాతి బంతికే క్రిస్ వోక్స్‌ని పెవిలియన్ చేర్చాడు.
ఈ దశలో కష్టాల్లోపడిన ఇంగ్లండ్‌కు జేమీ స్మిత్, బ్రైడన్ కార్సేలు అండగా నిలిచారు. వీరిద్దరు కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే అర్థశతకం సాధించిన స్మిత్‌ను(51) సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బుమ్రా (Jasprit Bumrah) జోఫ్రా ఆర్చర్(4) వికెట్‌ను తీసి.. లార్డ్స్‌లో తన తొలి ఐదు వికెట్ల హౌల్‌ని సాధించాడు. వికెట్లు పడుతున్న కార్సే మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేస్తూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అయితే సిరాజ్ బౌలింగ్‌లో కార్సే (56) ఔట్ అయ్యాడు. దీంతో 112.3 ఓవర్లలో ఇంగ్లండ్ 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్‌లో బుమ్రా 5, సిరాజ్, నితీశ్ చెరి 2, జడేజా 1 వికెట్ తీశారు.