ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకంజలో ఉంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఓటమిని తప్పించుకొని డ్రాతో సరిపెట్టుకుంది. దీంతో సిరీస్ ఆశలు సజీవం చేసుకుంది. ఇప్పుడు ఓవెల్ వేదికగా జరిగే ఐదో టెస్ట్ భారత్‌కి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. సిరీస్ డ్రా అవుతుంది. లేని పక్షంలో ఇంగ్లండ్ విజేతగా నిలుస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ మ్యాచ్‌కి దూరం కానున్నాడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఈ మ్యాచ్‌కి బుమ్రాకి విశ్రాంతి ఇచ్చినట్లు బిసిసిఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రాను (Jasprit Bumrah) ఆడించాలని తొలుత భావించారు. కానీ, అతని ఫిట్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకొని మున్ముందు సమస్యలు రాకుండా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఐదో టెస్ట్‌కి జట్టులోకి ఆకాశ్‌దీప్‌ని తీసుకోనున్నట్లు సమాచారం. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్‌తో కలిసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి పది వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఓవెల్‌లో జరిగే టెస్ట్‌లోనూ ఆకాశ్‌దీప్ గట్టి ప్రభావం చూపించాలని.. అలా అయితేనే భారత్‌కు విజయావకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదో టెస్ట్ ఓవెల్ వేదికగా గురువారం (జూలై 31వ) తేదీ నుంచి ప్రారంభంకానుంది.