Wednesday, August 6, 2025

ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నర్సంపేట: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గీతాంజల్లి విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ పోరిక సంపత్‌కుమార్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. నిధులు, నీళ్లు నియామకాల కోసం కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలాలు పొందేందుకు విద్యార్థులంతా కష్టపడి చదివి ఆ ఫలాలు పొందాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు కీలకమని ఈ రెండేళ్లు కష్టపడి చదివితే మీ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకున్న వారవుతారని తద్వారా తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టినవారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణాచారి, కళాశాల లెక్చరర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖానాపురంలో.. మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన తెలంగాణ స్పూర్తి ప్రధాత, ఆచార్య కొత్తపల్లి జయశంకర సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాస ప్రవీణ్, కోరె సుధాకర్, వల్లపు శ్రీను, వేజల్ల కిషన్‌రావు, తిరుపతిరెడ్డి, ఎస్‌కే మౌళానా, ఎస్‌కే యాకూబ్‌పాషా, బంధారపు శ్రీను, తేజావతీ బాలునాయక్, మరి రామస్వామి, ఎండీ అజార్, కుందనపల్లి శైలజ, నేలమారి నాగరాజు, ముద్దంగుల సంపత్, కోరె రాము, వడ్డె రాజశేఖర్, బానోతు ఈర్య, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

దుగ్గొండిలో.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి, హెచ్‌ఎం రామస్వామిలు పూలమల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర మరులేనిదన్నారు. తెలంగాణ ఏర్పాటు ధ్యేయంగా నిరంతరం ఉద్యమించిన మహానేత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుశీల, విజయలక్ష్మి, మహేష్, సంధ్యారాణి, రజిని, అహ్మద్, కరుణ, కిరణ్ కుమార్, లీలావతి పాల్గొన్నారు.

చెన్నారావుపేటలో… చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్న ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్క అశోక్, అమీనాబాద్ సొసైటీ ఛైర్మన్ మురహరి రవి, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు రఫీ, ఉపాధ్యక్షుడు నరేందర్, మండల అధికార ప్రతినిధి కంది కృష్ణచైతన్యరెడ్డి, నాయకులు ప్రదీప్‌కుమార్, సాంబయ్య, విజయరామరాజు, మల్లయ్య, కుమారస్వామి, శ్రీనివాస్, సతీష్, ఉపేందర్, మహేందర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీవాణి జయశంకర్ చిత్రపాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతోపాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హసన్‌పర్తిలో.. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అటికం రవీందర్ ఆధ్వర్యంలో భీమారం బస్ షెల్టర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హన్మకొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ కన్వీనర్ సంగాల విక్టరీబాబు, ఎర్రగట్టు గుట్ట దేవస్థాన మాజీ ఛైర్మన్ చింతల లక్ష్మణ్, గ్రామాధ్యక్షుడు రాయకంటి సురేష్, 55వ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు బెతెల్లి యాకయ్య, బీఆర్‌ఎజ్ జిల్లా నాయకుడు పోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాతి సమ్మయ్య, పోగుల రమేశ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేరుగుత్తి రఘు తదితరులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(వోపా) బాధ్యులు డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్ సార్ స్మృతి వనంలోని ఆయన విగ్రహానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వోపానాయకులు నివాళులర్పించారు. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయానల్నారు. ఈ కార్యక్రమంలో వోపా నాయకులు సంగోజు మోహన్, డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్దన్, మహేశ్వరం బిక్షపతి, ఆకోజు సురేందర్‌రావు, కలకొండ రాజేంద్రప్రసాద్, కొక్కండ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News