18న జెఇఇ అడ్వాన్స్‌డ్ జరుగుతుందా..?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో
విద్యార్థుల్లో సందేహాలు
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన జరగాల్సిన జెఇఇ(JEE exam) అడ్వాన్స్‌డ్ జరుగుతుందా…? అని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్టా ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగనున్నది. జెఇఇ(JEE exam) మెయిన్‌లో దేశవ్యాప్తంగా 2,50,236 మంది విద్యార్థులు కనీస కటాఫ్ పర్సంటైల్ సాధించి జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మే 11) జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల కావాల్సి ఉంది. ఆ లోగా జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.