Thursday, May 1, 2025

ఇలాంటి వారిని సమాజంలోనికి అనుమతి ఇస్తారా?: జాన్వీ కపూర్

- Advertisement -
- Advertisement -

ముంబయి: సమాజంలో జరుగుతున్న విషయాలపై అప్పటికప్పుడు నటి జాన్వీకపూర్ సామాజిక మాద్యమాల్లో స్పందిస్తారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. మద్యం మత్తులో ఓ మహిళ కారు నడిపి బాలిక ప్రాణాలు తీసిన ఘటనపై జాన్వీ ఘాటుగా స్పందించారు. చట్టాలను ఎందుకు గౌరవించడంలేదని, కనీసం అవగాహనం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో ఇతరుల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసిన వెంటనే ఆమె దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమాజంలో ఎవరినైనా అనుమతి ఇస్తారా? అని మండిపడ్డారు. మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, మరెంతో మంది గాయాల పాలవుతున్నారని తెలియజేశారు.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమె నటించిన పరమ్ సుందరి విడుదలకు సిద్ధంగా ఉంది. పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు తోడుగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News