Thursday, September 4, 2025

ఝార్ఖండ్ లో ఎదురుకాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఝార్ఖండ్ రాష్ట్రం పాలమూ జిల్లాలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది చనిపోయారు. మరొకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మానాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేడల్ గ్రామంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో టిఎస్‌పిసి కమాండర్ శశికాంత్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది రాకను గమనించిన మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. మరొకరు గాయపడడంతో మెడినిరాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: చెత్తగాళ్ల వెనుక… నేనెందుకు ఉంటా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News