Wednesday, September 17, 2025

నిరుద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ గద్దె దించడంలో యువత పాత్ర కీలకమన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని అమరవీరుల సాక్షిగా చెప్తున్నానని, సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వస్తానని తమ నిరసనలకు మద్దతిస్తానని తెలియజేశారు. నిరుద్యోగుల సమస్యలను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, తెలంగాణకు అన్యాయం జరగవద్దనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోంది: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News