- Advertisement -
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్ అని.. అది ఎముకలకు వ్యాపించినట్లు బైడెన్ కార్యాలయం వెల్లడించింది. మొదట బైడెన్ మూత్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపిన ఆయన కార్యాలయం.. తర్వాత శుక్రవారం జరిపిన పరీక్షల్లో ఆయనకు క్యాన్సర్ రోగ నిర్ధారణ జరిగినట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఈ క్యాన్సర్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. దీంతో బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు.. ఈ క్యాన్యర్ కు అవసరమైన చికిత్స కోసం వైద్య బృందంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఆయన కార్యాలయం చెప్పింది. దీనిపై స్పందించిన ప్రెసిడెంట్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు.
- Advertisement -