Wednesday, April 30, 2025

నిద్ర మొహం బైడెన్

- Advertisement -
- Advertisement -

అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్
మాజీ అధ్యక్షుడు బైడెన్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు
లక్షల మంది నేరస్థులు దేశంలోకి వచ్చారని ఆరోపణ
వారిలో హంతకులు, డ్రగ్ డీలర్లు, ఖైదీలు ఉన్నారని ట్రంప్ వ్యాఖ్య

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై, ఆయన అనుసరించిన వలస విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిద్ర మొహం బైడెన్ అసమర్థ పాలన, లోపభూయిష్టమైన విధానాల కారణంగా లక్షలాది మంది నేరస్థులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ ఆరోపించారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల్లో బైడెన్‌ను ఉద్దేశించి ఘాటు పదజాలం ఉపయోగించారు. ‘అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడైన జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నేరస్థులను మన దేశంలోకి అనుమతించారు’ అని ట్రంప్ ఆరోపించారు.

ప్రమాదకరమైన, అనాలోచిత ‘బహిరంగ సరిహద్దు’ విధానం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. దేశంలోకి వచ్చినవారిలో చాలా మంది హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులు ఉన్నారని, ప్రపంచంలోని అనేక జైళ్లు, మానసిక వైద్యశాలల నుంచి విదుడలైన వ్యక్తులు కూడా ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. ‘ఈ హంతకులు, దుండగులను ఇక్కడ నుంచి పంపివేయడం నా పని. దాని కోసమే నన్ను ప్రజలు ఎన్నుకున్నారు& ఇలా చేయక తప్పడం లేదు, నన్ను క్షమించండి’ అని ట్రంప్ పేర్కొన్నారు. తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఎజిఎ)’ నినాదాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News