అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఆయన కార్యాలయం తెలియజేసింది. ఇటీవల బైడెన్‌కు ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షించి ఆయన ప్రోస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్టు గుర్తించారు పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌సోషల్ వేదికగా స్పందించారు. “ జోబైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం.
ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ” అని ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్‌కు క్యాన్సర్ విషయం తనను కలచివేసిందని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండ గా ఉంటామని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని, ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బైడెన్ ఆరోగ్యం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.