ప్రస్తుత మోడ్రన్ క్రికెట్ దిగ్గజాల్లో జో రూట్ (Joe Root) ఒకడు. ఏ ఫార్మాట్.. అయినా రూట్ రికార్గులకు పెట్టింది పేరు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో రూట్ ఎన్నో ఘనతలను సాధించాడు. తాజాగా భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఓ అరుదైన ఫీట్‌ని తన పేరిట రాసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాళ్ల జాబితాలో రూట్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కల్లిస్‌లను దాటేశాడు. మూడో రోజు తొలి సెషన్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ద్రవిడ్‌ను.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కల్లిస్‌ను అధిగమించాడు.
ఇక టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ (Joe Root) కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నారు. భారత్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో రూట్ పాంటింగ్‌ను అధిగమించే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత వాషింగ్టన్ సుందర్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. తన బౌలింగ్‌లో పోప్(71)ని పెవిలియన్ చేర్చిన సుందర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన బ్రూక్‌ని కూడా స్టంప్ ఔట్‌గా వెనక్కి పంపించాడు. దీంతో ఇంగ్లండ్ 81 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆధిక్యం సాధించాలంటే ఇంగ్లండ్‌కు ఇంకా తొమ్మిది పరుగులు కావాలి.