Tuesday, July 22, 2025

భారీ రికార్డుపై కన్నేసిన రూట్.. అదే జరిగితే నెం.2కి వెళ్లిపోతాడు..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ (Joe Root) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇండియాతో జరుగుతున్న సిరీస్‌లో అతడు మంచి ప్రదర్శన చేస్తున్నాడు. లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఇక మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్‌లో భారీ రికార్డుపై జో రూట్ కన్నేశాడు. రూట్ ప్రస్తుతం టెస్టుల్లో 13,259 పరుగులు చేశాడు. అందులో 66 అర్థ శతకాలు, 13 శతకాలు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసి ఆటగాళ్ల లిస్ట్‌లో రూట్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ నాలుగో టెస్ట్‌లో 31 పరుగులు చేస్తే.. రాహుల్ ద్రవిడ్ (13,288), జాక్వెస్ కలిస్ (13,289)ని దాటేసి మూడో స్థానంలోకి వస్తాడు.

ఇక నాలుగో టెస్ట్‌లో ఒకవేళ రూట్ (Joe Root) 120 పరుగుల చేయగలిగితే.. రికి పాంటింగ్ (13,378)ని దాటేసి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. ఇక ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉంది టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆయన కెరీర్‌లో మొత్తం 15,921 పరుగులు చేశారు. 34 ఏళ్ల రూట్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ.. మరో రెండు లేదా మూడేళ్లు టెస్టుల్లో ఆడి.. మరో 2,663 పరుగులు చేస్తే.. ఈ రికార్డును కూడా బద్దలుకొట్టే అవకాశం ఉంది. కాగా, నాలుగో టెస్ట్‌ మ్యాచ్ మాంచెస్టర్‌లో బుధవారం (జూలై 23 నుంచి 27) వరకూ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News