Friday, August 8, 2025

ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. ఆ విషయంలో సచిన్‌ను దాటేసిన రూట్!

- Advertisement -
- Advertisement -

లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన భారత్‌కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తోంది. అయితే ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో స్టార్ ఆటగాడు జో రూట్ (Joe Root) విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన రూట్.. ఇంగ్లండ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచుల్లో 1589 పరుగులు చేశాడు.

గతంలో ఈ రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశారు. ఇప్పుడు రూట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రూట్ (Joe Root) సత్తా చాటలేకపోయాడు. 28 పరుగుల స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్‌లో తొలి రోజు ఆధిపత్యం చూపించిన టీం ఇండియా.. రెండో రోజు తడబడింది. 113 ఓవర్లలో 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఒలీ పోప్ సెంచరీతో చెలరేగగా, బెన్ డకెట్ అర్థశతకంతో రాణించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజ్‌లో పోప్, హ్యారీ బ్రూక్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News