Friday, August 22, 2025

ఎసిబికి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

- Advertisement -
- Advertisement -

జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఎసిబి వలకు చిక్కారు.వివరాలలోకి వెళితే.. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఒక బాధితుడి నుంచి రూ.5 వేలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ డిమాండ్ చేశాడు. అయితే, లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు శుక్రవారం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లంచం డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని కరీంనగర్ కోర్టుకు తరలించనున్నట్లు ఎసిబి డిఎస్‌పి మధు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News