- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే.. రికార్డుల గని. ప్రతి లీగ్‌లో ఎన్నో పాత రికార్డులు బద్దలవుతుంటాయి… కొత్తవి తయారవుతుంటాయి. తాజా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఐపిఎల్‌లో అత్యధిక పరుగలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేసిన బట్లర్ ఐపిఎల్ కెరీర్‌లో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపిఎల్‌లోఅత్యంత వేగంగా 4వేల పరుగుల మైలురాయిని దాటిన బ్యాటర్‌గా.. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మార్కును చేరుకున్న నాలుగో క్రికెటర్‌గా రికార్డు సాధించాడు బట్లర్. గతంలో బట్లర్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తరఫున ఆడాడు.
- Advertisement -