- Advertisement -
హైదరాబాద్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ సిటీలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రముఖులు వస్తుండటంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -