Saturday, July 12, 2025

నడిచొచ్చిన న్యాయస్థానం

- Advertisement -
- Advertisement -

 నడవలేని స్థితిలో నిందితులు
కోర్టు వెలుపలికి వచ్చి
విచారించిన న్యాయమూర్తి
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో
అరుదైన ఘటన
మన తెలంగాణ/బోధన్: ఓ కేసు నిమిత్తం కోర్టు కు వచ్చిన వృద్ధ దంపతులను చూసి చలించిపోయిన న్యాయమూర్తి కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి విచారించారు. ఈ అరుదైన ఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదనపు క ట్నం కేసు విషయంలో కోడలు, అత్త, మామపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం కో ర్టుకు వచ్చిన వృద్ధ్ద దంపతులు నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జెఎఫ్‌సిఎం న్యాయమూర్తి సాయి శివ కోర్టు బయటకు వచ్చి ఆటోలో ఉన్న వృద్ధ్ద దంపతుల నుం చి వివరాలను సేకరించారు. కాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ్ద దంపతుల వద్దకు కోర్టు హా లును విడిచి న్యాయమూర్తే స్వయంగా వచ్చి వి చారణ చేపట్టడం ఆయనలోని మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఈ సంఘటనను చూసిన పలువురు న్యాయమూర్తిని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News