Sunday, May 11, 2025

ఇద్దరు ప్రాణాలు తీసిన కూలర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ఎండాకాలంలో వేడిగా ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్ ఆన్ చేశారు. ఈ కూలర్ తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుల్లాతండాలో ప్రహాద్, శాంకబాయి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు హైదరాబాద్‌లో చదువుకుంటుండగా ఆమె వద్దకు తండ్రి వెళ్లాడు.

శాంకబాయి తన చిన్న కుమారుడు(16), కుమార్తె శ్రీవాణి(12)తో కలిసి కూలర్ ఆన్ చేసుకొని నిద్రపోయారు. శ్రీవాణి కాలుకు కూలర్‌ తాకడంతో కరెంట్ షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో తల్లి కూడా కూతురు తాడకంతో ఆమె కూడా కరెంట్ షాక్ కు గురయ్యారు. ఉదయం నిద్ర నుంచి లేచిన కుమారుడుకి తల్లి, చెల్లి  చనిపోయి కనిపించడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News