ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి రెడ్డి హీరోగా వస్తున్న చిత్రం ‘జూనియర్‘. ఇందులో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. డ్యాన్స్, యాక్షన్ సీన్స్ లో కిరీటి రెడ్డి చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. శ్రీలీల లవ్ ట్రాక్ సీన్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా టీజర్ కలర్ ఫుల్ గా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ఇక, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అలాగే, చాలా సంవత్సరాల తర్వాత హీరోయిన్ జెనీలియా ఈ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. వారాహి చలన చిత్ర బ్యానర్ పై డైరెక్టర్ రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 18న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
‘జూనియర్’ టీజర్ రిలీజ్.. జెనీలియా ఈజ్ బ్యాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -