Monday, June 30, 2025

జూరాల 12 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎగువ ప్రాంతంలోని కర్ణాటక జలాశయాల నుంచి వస్తున్న నీటి ఉద్ధృతితో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జూరాల అధికారులు 12 స్పీల్ వే గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 317.300 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్ధం 9.657 టిఎంసిలకు గాను ప్రస్తుత నీటి నిలువ 7.279 టిఎంసిలుగా నమోదైంది. జూరాలకు ఇన్‌ప్లో 1,50,000 క్యూసెక్కులుగా ఉండగా 12 గేట్ల ద్వారా దిగువకు 1,16,424 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాలువకు సాగునీటిని యధావిధిగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News