Friday, July 25, 2025

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జురాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,06,620 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టు ఔట్ ఫ్లో 1,42, 482 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుత నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది.  శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టిఎంసిలుండగా ప్రస్తుత నీటి నిల్వ 207.41 టిఎంసిలుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News