న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై బురదచల్లే విధంగా ఉన్నాయని విశ్రాంత న్యాయమూర్తులు మూకుమ్మడి గా నిరసన వ్యక్తం చేశారు. 18 మంది రిటైర్డ్ జడ్జిలతో కూడిన బృందం సో మవారం ఈ మేరకు తమ సంయుక్త ప్రకటన వెలువరించారు. ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్‌గా పనిచేసిన బి సుదర్శన్ రెడ్డిపై అ మిత్ షా ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలను ఈ న్యాయమూర్తులు తప్పుపట్టారు. కోర్టు వ్యాజ్యాల దశలో జస్టిస్ రెడ్డి వెలువరించిన సల్వా జుడుం తీర్పును ఉద్ధేశించి అమిత్ షా మాట్లాడారు. ఇది న్యాయవ్యవస్థలో జో క్యంగా, పరిధి అతిక్రమణగా భావించాల్సి ఉంటుందని, ఇటువంటి వ్యా ఖ్యలకు హోం మంత్రి దిగడం దురదృష్టకరమని ,
పేరు పెట్టి పిలవడం అ నుచితం అని న్యాయమూర్తుల బృందం నిరసన వ్యక్తం చేసింది. ఈ బృం దంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, మదన్ బి లోకూర్, జె చలమేశ్వర్ వంటి సీనియర్లు, ప్రముఖులు కూడా ఉన్నారు. న్యాయవ్యవస్థ పట్ల వక్రీకరణ భావ్యం కాదని తేల్చిచెప్పారు. అత్యున్నత న్యాయస్థానం గత తీర్పుపై అధికారిక స్థానంలో ఉన్న వారి మాటలు న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని విమర్శించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తమ హయాంలో నక్సలిజం పట్ల మొగ్గుచూపారని షా నిందించారు. గతంలో సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు.
ఆయన నక్సలైట్లకు మద్దతు పలికారని, సల్వాజుడుం తీర్పును ఉటంకించారు. జస్టిస్ వెలువరించిన తీర్పులో ఎక్కడ కూడా నక్సలిజం పట్ల మద్దతు వ్యక్తం చేసిన దాఖలాలులేవు. ఏ కోణంలోనే తీర్పు పక్షపాత ధోరణితోలేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నక్సలిజం లేదా సంబంధిత వామపక్ష తీవ్రవాద సిద్ధాంతాలను బలపర్చలేదనే విషయం గుర్తుంచుకోవాలి. లేదా గ్రహించాల్సి ఉంటుంది. పైగా జస్టిస్ పేరు పెట్టి మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమే అని భావించాల్సి ఉంటుందనిఈ బృందం తెలిపింది. సంయుక్త ప్రకటనపై న్యాయమూర్తులు ఎకె పట్నాయక్, అభయ్ ఓకా, గోపాల గోవ్డా, విక్రమ్‌జిత్ సేన్ కూడా సంతకాలు చేశారు. ఉప రాష్ట్రపతి పదవికి ప్రచారం అనేది సిద్ధాంతపరంగా జరగాల్సి ఉంది. సభ్యసమాజం మెచ్చుకునేలా, హుందారీతిలో సాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాని సిద్ధాంతాల పేరిట ఏ అభ్యర్థిని అయినా పనిగట్టుకుని నిందించడం సరికాదని హితవు పలికారు. పలు రాష్ట్రాల రిటైర్డ్ జడ్జిటు, సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే సహా మరికొందరు లాయర్లు ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.