మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హై కోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టి స్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులయ్యా రు. జస్టిస్ అపరేశ్ కుమార్ నియామకంపై సు ప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అపరేశ్ కుమార్ సింగ్ ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. జార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయ వృత్తిని ప్రారంభించారు. ఇదిలా ఉండగా, అపరేష్ కు మార్ సింగ్ (ఎకెసింగ్) 1965, జూలై 7న జ న్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ బి పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టులో న్యా యవాదిగా పనిచేశారు.
ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చే శారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుల య్యా రు. 2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యా య సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అపరేష్ కుమార్ నియమితులయ్యారు. ఇక 2022 నుంచి 2023 వరకూ జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 20 23, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యా య మూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి సాధించారు. కాగా, తాజాగా తెలంగాణ హైకోర్టు సిజెగా నియమితులయ్యారు. న్యాయ రంగంలో ఆయనకు ఉన్న అనుభవం, తీర్పుల్లో ఆయన చూపిన నిష్పక్షపాత్ర, న్యాయశాస్త్రంపై లోతైన అవగాహన తెలంగాణ న్యాయవ్యవస్థకు తోడ్పాటును అందించనుందని న్యాయవర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.