Saturday, May 17, 2025

త్వరలో ప్రభుత్వానికి ఘోష్ నివేదిక

- Advertisement -
- Advertisement -

 కాళేశ్వరంపై విచారణను పూర్తి
చేసిన కమిషన్ వెయ్యి పేజీల
వరకు ఉండవచ్చునని అంచనా
మూడోవారంలో ప్రభుత్వానికి
అందించనున్న జస్టిస్ ఘోష్

మన తెలంగాణ / హైదరాబాద్: కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, ఆన్నారం, సుందిళ్ల ఆనకట్టల లోపాలకు సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసిఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలను పిసి ఘోష్ కమిషన్ సున్నితంగా పరిశీలించి వాటిలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నివేదికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు వెయ్యి పేజీలకు పైగా నివేదికను జస్టిస్ పిసి ఘోష్ రూపొందించారని, ఈనెల మూడో వారంలో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా సమాచారం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డిజైన్లు, బ్యారేజిల నిర్మాణాలు, వాటి నాణ్యత, నిర్వహణ, వాటిని నిర్మించిన నిర్మాణ కాంట్రాక్టు సంస్థలు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఇఎన్‌సి)లు, సీనియర్ ఇంజినీర్లను విచారించిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా నిర్మాణ సంస్థల నుంచి ముందుగా అఫిడవిట్లను కమిషన్ తీసుకుని వాటిని ఆధారంగా సంబంధిత సంస్థల బాధ్యులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News