Saturday, August 2, 2025

సర్కార్ చేతికి కాళేశ్వరం నివేదిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘో ష్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేశారు. కాళేశ్వరం ఎత్తిపోత ల పథకం(కెఎల్‌ఐఎస్)లో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ ఏకసభ్య కమిషన్ తన నివేదికను బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని ఎనిమిదో అంతస్థులోని తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. క మిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ దాదాపు 650 పేజీలతో పైగా ఉన్న తననివేదికను మూ డు వ్యాల్యూమ్స్‌ను సీల్డ్ కవర్లలో పెట్టి స్వయంగా రాహుల్ బొజ్జాకు అందజేశా రు. జస్టిస్ ఘోష్ నివేదిక ప్రభుత్వానికి చే రడంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. జస్టిస్ ఘోష్ నుంచి కాళేశ్వరం కమిషన్ రిపోర్టులను స్వీకరించిన వెంటనే వాటితో రాహుల్ బొజ్జా సచివాలయానికి చేరుకున్నారు. విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు చెప్పి ఒక వ్యాల్యూమ్‌ను చీఫ్ సెక్రెటరీకి అందజేసినట్లు సమాచారం. తదుపరి కాళేశ్వరం కమిషన్ అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

సచివాలయం లాకర్లలో నివేదిక భద్రం
జస్టిస్ ఘోష్ నుంచి కాళేశ్వరం కమిషన్ రిపోర్టులను స్వీకరించిన వెంటనే వాటితో రాహుల్ బొజ్జా సచివాలయానికి చేరుకున్నారు. విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు చెప్పి ఒక వ్యాల్యూమ్‌ను చీఫ్ సెక్రెటరీకి అందజేసినట్లు సమాచారం. తదుపరి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు తెలియజేసినట్లు తెలిసింది. ఆగస్టులో జరిగే మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై ప్రభుత్వం చర్చించేందుకు వీలుగా రిపోర్టులను సచివాలయంలో విఐపి లాకర్లలో భద్రపరచినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలో చర్చ తర్వాతే..
కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టును ప్రభుత్వం ఆగస్టులో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నది. ఆతర్వాత ఘోష్ నివేదికపై న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్‌కు పంపించనున్నది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత జస్టిస్ ఘోష్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నది.

నా పని పూర్తి అయ్యింది : జస్టిస్ ఘోష్
కాళేశ్వరం విచారణపై నివేదికను ప్రభుత్వానికి అందజేసిన తదుపరి జస్టిస్ పిసి ఘోష్ మీడియా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారంతో ముగిసిందని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనను కాళేశ్వరం కమిషన్ చైర్మన్‌గా నియమించారు, విచారణ నిర్వహించి తుది నివేదికను ప్రభుత్వానికి అందించానని తెలిపారు. ప్రభుత్వం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని, నివేదిక ఇవ్వడమే తన పని అని వ్యాఖ్యానించారు. నివేదికపై చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, జస్టిస్ ఘోష్ శుక్రవారం సాయంత్రం తన స్వస్థలం కోల్‌కత్తాకు బయలుదేరి వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News