మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై బాధిత కుటుంబ పెద్ద 67 సంవత్సరాల లియాఖత్ ఫేక్ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ ట్రయల్ కోర్టు తమకు న్యాయం చేయలేదని, దోషులను నిర్దోషులుగా ఏ విధంగా నిర్థారిస్తారని ప్రశ్నించారు. 2008 సెప్టెంబర్ 29వ తేదీనాటి ఈ పేలుళ్లలో చనిపోయిన పది సంవత్సరాల చిన్నారి ఫర్హీన్ తండ్రి అయిన షేక్ ఈ తీర్పుపై స్పందించారు. తాము న్యాయం కోసం హైకోర్టుకు మరీ అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళ్లుతామని మాలేగావ్‌లో ఈ వృద్ధుడు తెలిపారు. తన కూతురు పసిప్రాయపు ఫర్హీన్ అకాల మరణం బాధ్యత ఎవరిది? అని నిలదీశారు. ఈ కేసులో బిజెపి మాజీ ఎంపి ప్రగ్యాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిర్దోషులని ముంబైలోని ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఇది తప్పుడు న్యాయం అని షేక్ చెప్పారు.
వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ఆయన ఘటన రోజు తన బిడ్డ భికు చౌక్‌లో తనకు ఇష్టమైన వడపావు కొనుకునేందుకు వెళ్లింది. పేలుడులో మృతి చెందింది. దీనికి ఎవరు బాధ్యులు అని నిలదీశారు, అప్పటి ఎటిఎస్ చీఫ్ హేమంత్ సాబ్ పూర్తి సాక్షాలతో ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరికి ఇప్పుడు విముక్తి కల్పించారు. ఇదెక్కడి న్యాయం , తాను ఉరుకునేది లేదని, బిడ్డ జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని, సుప్రీంకోర్టు లేదా ఏ అత్యున్నత న్యాయస్థానం వరకైనా వెళ్లి తీరుతామని బిడ్డను తల్చుకుంటూ చెప్పారు. ఈ ఘటనలో మతంతో సంబంధం లేదని , బాధిత కుటుంబాలకు న్యాయం అందాలని నిసార్ అహ్మద్ చెప్పారు. అహ్మద్ కుమారుడు సయీద్ అజహర్ ఆరోజు పేలుళ్లలో చనిపోయాడు.