Saturday, May 17, 2025

న్యాయమూర్తిణి త్రివేది పదవీ విరమణ… తండ్రితో కలిసి జడ్జిగా సేవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో 11వ మహిళా న్యాయమూర్తి బేలా ఎం త్రివేది (Justice Trivedi) తమ మూడున్నరేళ్ల సర్వీసు తరువాత శుక్రవారం పదవి విరమణ చేశారు.తన చిరకాల వృత్తికి ఇప్పుడు వీడ్కోలు చెపుతున్నానని ఆమె భావోద్వేగంతో స్పందించారు. సుప్రీంకోర్టుకు నియమితులు అయిన 11వ మహిళా న్యాయమూర్తి బేలా త్రివేదినే. కాగా 1995లో గుజరాత్‌లో ట్రయల్ కోర్టు జడ్జిగా ఉన్న ఆమె నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన అరుదైన ఖ్యాతిని దక్కించుకున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన అత్యంత కీలక మైలురాళ్ల వంటి తీర్పుల క్రమంలో ఆమె ధర్మాసనంలో సభ్యురాలిగా కీలక పాత్ర పోషించారు.

అత్యంత విచిత్రరీతిలో ఆమె ఆమె తండ్రి గతంలో గుజరాత్‌లో ఒకే కోర్టులో జడ్జిలుగా వ్యవహరించారు.ఇది 1996 లిమ్కా బుక్ ఆఫ్ ఇండియన్ రికార్డు పుటల్లోకి చేరింది. ఈ విషయాన్ని జస్టిస్ త్రివేది ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. తండ్రితో కలిసి ఒకే న్యాయస్థానంలో పనిచేసిన సందర్భం తనకు గర్వకారణం అని స్పందించారు. నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌గవాయ్ సారధ్యపు వీడ్కోలు ధర్మాసనం తరఫున ఆమెకు సుప్రీంకోర్టు వీడ్కోలు పలికింది. ఆమె హయాంలోనే అనేక మైలురాయి తీర్పులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News