న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు దగ్ధం ఉదంతంలో సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ స్పందించింది. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం నిజమే అని ఆయన దోషి అని పేర్కొంది. అభియోగాలు మోపింది.
దీనితో వర్మ ఇక రాజీనామా చేయడం లేదా , భారీ స్థాయి అభిశంసనకు గురి కావల్సి ఉంటుంది. లెక్కలలో చూపని ఆదాయం తాలూకు రూపాయల నోట్ల కట్టలు భారీ స్థాయిలో ఈ ఏడాది ఆరంభంలో ఆయన నివాసంలో కాలిన స్థితిలో చెత్తకుండీలలో సోదా అధికారులకు దొరికాయి.
అవినీతి అక్రమాల వ్యవహారం నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు అయిన అంతర్గత హౌస్ కమిటీ ఇప్పుడు ఆయనను దోషిగా తేల్చింది. ప్రధాన న్యాయమూర్తికి ఈ త్రిసభ్య న్యాయమూర్తుల ప్యానల్ ఈ నెల 4న నివేదిక అందించింది.జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన అభియోగాలు నిజమేనని తెలిపే సరైన సాక్షాధారాలు తమ విచారణ క్రమంలో దొరికాయని కమిటీ తెలిపింది. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పరపిస్తారు. ఆయన అభిశంసనకు కమిటీ సిఫార్సు చేసినట్లు ఈ లోగానే ఆయన రాజీనామాకు దిగనున్నట్లు వెల్లడైంది