హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మారుమోగిపోతున్న పేరు కల్వకుంట్ల కవిత (K Kavitha). మంగళవారం ఆమెను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు (బుధవారం) ఆమె పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కవిత ఎక్స్‌లో సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘నిజం మాట్లాడేందుకు ఖర్చు అవుతుందంటే.. తెలంగాణ ప్రజల కోసం దానికి వంద రేట్లు మూల్యం చెల్లిండానికి నేను సిద్ధం. సత్యమేవ జయతే.. జై తెలంగాణ’’ అంటూ కవిత పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
బిఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, సంతోష్‌లపై కవిత (K Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌ల వల్లే కెసిఆర్‌కు అవినీతి మరక అంటుకుందని కవిత అన్నారు. దీంతో పాటు ఆమె చేసిన కీలక వ్యాఖ్యల కారణంగా పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో ఆమె బుధవారం ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ఆరోణలు చేశారు. మరోవైపు కవిత సస్పెన్షన్‌ను పలువురు బిఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నారు.
Also Read : రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కు… నాపై కుట్రలు: కవిత