మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన అభిమానులకు డబుల్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోమవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘కాంత’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీని 1950 కాలంలో మద్రాసులో సినిమా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. శాంత సినిమా విషయంలో హీరో, డైరెక్టర్ కు మధ్య ఘర్షణ జరగడం.. ఆ మూవీ పేరును హీరో కాంతగా మారుస్తున్నట్లు ప్రకటించడం.. ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలతో రూపొందించిన టీజర్ ఆకట్టుకుంటోంది. మహానటి, సీతారామమ్, లక్కీ భాస్కర్ సినిమాలతో అదుర్స్ అనిపించిన దుల్కర్.. ఇందులోనూ మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దుల్కర్, రానా దగ్గుబాటి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 12న విడుదల కానుంది. దుల్కర్ నటిస్తున్న మరో సినిమా ‘ఆకాశంలో ఒక తార’. ఈ మూవీ గ్లింప్స్ కూడా మేకర్స్ విడుదల చేశారు.
‘కాంత’ టీజర్ అదుర్స్.. దుల్కర్ యాక్టింగ్ పీక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -