- Advertisement -
హైదరాబాద్: ఎమ్మెల్యే ల పార్టీల ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బిఆర్ఎస్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కడియం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వివిధ పార్టీలను, ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో విలీనం (Merge MLAs BRS) చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేశారు. ఉపఎన్నికలు నిర్ణయించేది కెటిఆర్ కాదని కడియం శ్రీహరి చురకలంటించారు.
- Advertisement -