Friday, September 12, 2025

ప్రేమపెళ్లి…. ప్రియురాలి కోసం భార్యను చంపి… దృశ్యం సినిమా చూపించాడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియురాలి కోసం గర్భవతిని భర్త తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా కాగవాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉగార గ్రామానికి చెందిన చైతాలిని ప్రదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చైతాలి గర్భం దాల్చడంతో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. చైతాలికి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి చెడిపోతుందని భావించాడు. దీంతో ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ లో భాగంగా స్నేహితులైన సద్దాం అక్బర్‌, రాజన్‌ గణపతిల సహాయం తీసుకున్నాడు.

Also Read: గ్రూప్-1 పోస్టులు అమ్ముకుంటారా?

ఆదివారం సాయత్రం ఆసుపత్రికి వెళ్దామని చైతాలిని ద్విచక్ర వాహనంపై ప్రదీప్ తీసుకెళ్లాడు. మూత్ర విసర్జన కోసం ఓ చోట బైక్ ఆపగా కారులో వచ్చి బైక్‌ను ప్రదీప్ స్నేహితులు ఢీకొట్టారు. చైతాలికి స్వల్పంగా గాయపడడంతో అదే కారులో ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా నాటకమాడారు. కారులోకి ఎక్కిన తరువాత చైతాలిని రాడ్ కొట్టి చంపారు. అనంతరం చైతాలి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని ప్రదీఫ్ డ్రామా ఆడారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులకు దృశ్యం సినిమాలు చూపించులనుకున్నాడు. భర్త చెప్పిన సమాదానాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడితో పాటు స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తన ప్రియురాలి కోసం గాఢంగా ప్రేమించిన అమ్మాయిని చంపుకోవడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది టైమ్ పాస్ గా మారిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడాకుల కేసుల్లో 90 శాతం ప్రేమ పెళ్లిలు ఉన్నాయని నెటిజన్లు వాపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News