- Advertisement -
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఆన్‌లైన్‌లో తన మరణ వార్త వదంతులు వ్యాపించడాన్ని ఖండించారు. తాను బాగానే ఉన్నానని తన అభిమానులకు తెలిపారు. కాజల్ అగర్వాల్ హిందీ, తెలుగు, తమిళం సినీ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తనకు యాక్సిడెంట్ జరిగిందన్న పుకారు ఉత్తుత్తిదేనని ఆమె స్పష్టం చేశారు. దేవుని దయ వల్ల నేను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను అని 40 ఏళ్ల ఈ నటి తెలిపారు. అలాంటి వదంతులను నమొద్దని ఆమె తన అభిమానులను కోరారు. ఆమె త్వరలో ‘ఇండియన్3’ సినిమాలో కనిపించనున్నారు. అది కమల్‌హాసన్ సినిమా. కాగా ఆమె సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’లో, తెలుగు ‘కన్నప్ప’ సినిమాలో ఇటీవల కనిపించారు.
- Advertisement -