- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరం కమిటి నివేదికను అసెంబ్లీలో పెడతామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలకు కెసిఆర్ సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ..కెసిఆర్ సభలో మాట్లాడతానంటే తమ సమయం కూడా ఇస్తామని, బిసి రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. మంచి పాలన అందిస్తున్నందుకు మమ్మల్ని తిడతారా? అని గత ప్రభుత్వాన్ని ఐలయ్య ప్రశ్నించారు.
- Advertisement -