ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాతలుగా రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరించిన సినిమా కలివి వనం. (Kalivi vanam) రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా హీరోయిన్‌గా నాగదుర్గ ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. కాసర్ల శ్యామ్, మాట్ల తిరుపతి, కమల్ ఇస్లవంత్ ఈ చిత్రానికి పాటలు అందించారు.
ఈ చిత్రం వనములను సంరక్షించుకునే కాన్సెప్ట్‌తో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలోని సారంగాపూర్ అడవులలో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా యూట్యూబర్ మీడియా మిత్రులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో కొండగట్టు బృందావన్ రిసార్ట్‌లో ఈ చిత్ర పోస్టర్‌ను లాంచ్ చేయడం జరిగింది. మై విలేజ్ షో శ్రీకాంత్, చందు, ధూమ్ ధాం ఛానల్ రాజు, యూట్యూబ్ స్టార్ టోనీ క్విక్, అచ్యుత్ మార్వెల్, వెంకట్ జోడు, బబ్లూ, శివ మెరుపుల, మౌనిక డింపుల్ తదితరులు పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.