Friday, July 11, 2025

అల్ఫ్రాజోలమే ఆయువు తీసింది

- Advertisement -
- Advertisement -

కల్తీకల్లు ఘటనలో శాంపిళ్ల సేకరణ,
పరీక్షలు మూడు దుకాణాల్లో
మత్తుమందు కలిపిన కల్లు
విక్రయించినట్లు నిర్ధారణ
నాలుగు దుకాణాల లైసెన్స్‌లు
సస్పెండ్ కూకట్‌పల్లి ఘటనలో
ఏడుకు చేరిన మృతుల సంఖ్య
51మంది బాధితులు మరో
ముగ్గురి పరిస్థితి విషమం

మన తెలంగాణ/హైదరాబాద్/కేపీహెచ్‌బి:కల్తీ క ల్లు ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుం ది. కల్తీ కల్లు తాగి ప్రజలకు అస్వస్థతకు గురవుతుండటంతో రంగంలోకి ఎక్సైజ్ శాఖ అధికారు లు నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. కల్తీ కల్లు తాగి పలువురు మృత్యువాత ప డడంతో ఎక్సైజ్ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి హైదర్‌నగర్, హెచ్‌ఎంటి కాలనీ, సర్దార్ ప టేల్‌నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లో కల్లు కంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్‌ను నారాయణగూడ రసాయన పరిశీలన కేంద్రానికి పం పారు. ఈ పరీక్షల్లో భాగ్యనగర్ మినహా మిగతా మూడు దుకాణాల్లో మత్తు మందుల కలయికతో కల్లు తయారీ జరిగినట్లు తేలింది. ఈ నివేదిక ఆ ధారంగా నలుగురు కల్లు వ్యాపారులు రవితేజ గౌ డ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు  అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

దీంతోపాటు హైదర్‌నగర్, హెచ్‌ఎంటి కాలనీ, సర్దార్‌పటేల్ నగర్, శంషీగూడలకు సంబంధించి నాలుగు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది. ఈ కల్లు తయారీలో అల్ఫాజోలాన్ని వినియోగించినట్టు తేలడంతో ఎక్సైజ్ పోలీసులు ఈ దుకాణాలపై చర్యలు చేపట్టారు. కాగా, కల్తీ కల్లు తాగి ఏడుగురు మృతి చెందగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కల్తీ కల్లు ఘటనలో మొత్తం 37 మంది అస్వస్థతకు గురికాగా, నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, నలుగురికి డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కల్తీకల్లు, అల్ఫాజోలం వాడకంపై పర్యవేక్షణ కరువు
స్థానికంగా ఉండే ఎక్సైజ్ పోలీసులు, ఎస్‌ఐలు కల్తీ కల్లుకు సంబంధించి వ్యాపారులతో కుమ్మక్కై అయ్యారని, వారి నుంచి నెలనెలా మాముళ్లకు వసూళ్లు చేస్తూ కల్తీ కల్లు తయారీపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు ఎక్సైజ్ పోలీసులు, ఎస్‌ఐలను హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఎస్‌ఐలు సివిల్ డ్రెస్సుల్లో వసూళ్లదందాకు పాల్పడుతున్నారని పలువురిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడం విశేషం. ఈ మధ్య నగర పరిధిలోని 10 కల్లు దుకాణాల్లో అల్ఫ్రాజోలం వాడుతున్నారన్న ఫిర్యాదు మేరకు దాడులు చేసిన ఎస్‌టిఎఫ్ సిబ్బంది ఆయా షాపుల నుంచి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్లు దుకాణాల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, డిటిఎఫ్, ఎస్‌టిఎఫ్ సిబ్బంది నెలవారీ మాముళ్లకు అలవాటుపడడంతో కల్తీకల్లు తయారీ, అల్ఫ్రాజోలం వాడకంపై పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏడుకు చేరిన మృతుల సంఖ్య
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతవాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతండటం స్థానికంగా కలవరం రేపుతొంది. కల్తీ కల్లు సేవించిన బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండగా అదేరీతిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు నిమ్స్, గాంధీ ఆసుపత్రులతోపాటు స్థానిక రాందేవ్ ఆసుపత్రులలో కలిసి 51 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈనెల 6న కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్, శంశీగూడ, హెచ్‌ఎంటి హిల్స్‌లలో కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో బాధితులు ఆసుపత్రులలో చేరడం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ సంఖ్య 51 మందికి చేరింది. మొదటి రోజు పెంటయ్య, మాధవి, యాదగిరి, మోనప్ప, కోటేశ్వర్‌రావు,

పోచమ్మ, రాములు, గోవిందమ్మ, లక్ష్మీ,దేవదాసు, నరసింహ్మా,యోబు, సత్యనారాయణలు రాందేవ్ ఆసుపత్రిలో చేరారు. 9వ తేదీన జంగమ్మ, సాయిచరణ్ కాలనీకి చెందిన బాలమణి, అరుంధతిల పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. హెచ్‌ఎంటి హిల్స్‌కు చెందిన సీతారాంను గాంధీకి తరలించారు. వీరిలో సీతారాం, నారాయణమ్మ, చాకలి బొజ్జయ్య, నారయణమ్మ, మౌనికలు మృతి చెందగా స్వరూప అనే మహిళ ఇంటివద్దనే అస్వస్థతకు గురై మృతి చెందింది. గురువారం నర్సమ్మ అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. దీంతో కల్తీ కల్లు కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 7కు చేరడం బాధిత కుటుంబాల్లో కలవరం రేపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News