Wednesday, August 20, 2025

కళ్యాణి వాగు ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

రెండు రోజులుగా  కురుస్తున్న వర్షాలకు కళ్యాణి వాగులోకి వరద నీరు భారీగా చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి వరద నీరు మంగళవారం చేరుకోవడంతో ఐదు రేడియల్ గేట్లు ఎత్తివేశారు. కళ్యాణి వాగు ప్రాజెక్ట్ ఎగువ భాగంలో కురిసిన వర్షాలకి వరదనీరు భారీగా వస్తుంది.ప్రాజెక్టులోకి 300 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా, అంతే నీటిని రేడియల్ గేట్ల ద్వారా మంజీరా నదుల్లోకి వదులుతున్నారు. ఇన్ ఫ్లో తగ్గితే ఒక్కొక్క ప్రాజెక్టు రేడియల్ గేట్లను కిందికి దించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 408. 30 మీటర్ల మేర నీరు ఉన్నట్లు వారు తెలిపారు. వర్షం ఉదృతి పెరిగి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరిగితే ప్రాజెక్టు గేట్లు మరింత పైకి ఎత్తనున్నట్లు వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News