కన్నడ భాషపై ఇటీవలి తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లను నటుడు కమల్ హాసన్ తోసిపుచ్చారు. తాను తప్పుచేసినట్లు రుజువైతేనే క్షమాపణ చెబుతానని అన్నారు. ప్రస్తుత వివాదంలో అది సాధ్యంకాదని కమల్ అభిప్రాయపడ్డారు. ఇదే తన జీవన విధానమని, అందులో జోక్యం చేసుకోవద్దని ప్రజలను కోరారు. నేను తప్పుచేసి ఉంటే క్షమాపణ చెబుతా. తప్పు చేయకపోతే, ఆ ప్రసక్తే లేదు. అన్నారు కమల్. తమిళం నుంచే కన్నడ భాష ఆవిర్భవించిందని కమల్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. దీని పై బేషరతుగా క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వివాదంలో కమల్ హాసన్ కు మద్దతుగా తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ నిలిచింది. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచి పుటింది అని చేసిన ప్రకటన కర్ణాటకలో తీవ్ర ఆగ్రహజ్వాలలు రగిల్చింది. ఈ ప్రకటనపై కన్నడ భాషా సంఘాలు, సాంసృ్కతిక సంఘాలు, చిత్ర పరిశ్రమ అనేక రాజకీయ నాయకులు కమల్ హాసన్ ను దుమ్మెత్తి పోశారు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అల్టిమేటం జారీ చేసింది. కర్ణాటకలో థగ్ లైఫ్ చిత్రం విడుదల కాకుండా నిషేధించినట్లు ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత తనకు పలు బెదిరింపులు వచ్చాయని నటుడు అన్నారు. ఇటీవల ఓ కార్యక్రంలో కమల్ హాసన ్ర్పసంగస్తూ, నా జీవితం, నా కుటుంబం తమిళం అంటూ ప్రసంగించారు. నటుడు శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా తన కుటుంబానికి చెందిన వాడే నని, అందుకే ఇక్కడకు వచ్చాడని మాట్లాడుతూ, కర్ణాటక భాష కూడా తమిళనం నుంచి పుట్టిందే అందుకే మిమ్మల్నీ మాలో చేర్చుకున్నా అని అన్నాడు. కన్నడభాష తమిళం నుంచి పుట్టిందన్న ప్రకటన పై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ నాయకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. కన్నడ భాష గొప్పతనం, ప్రాచీనత , ప్రాభవం కమల్ హాసన్ కు తెలియదని అన్నారు. కర్ణాటక సాంసృ్కతిక శాఖమంత్రి శివరాజ్ తంగడగై కమల్ హాసన్ చిత్రాలను కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ ప్రసంగం కర్ణాటక ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు.