Monday, September 8, 2025

ఆ వార్తలే నిజం.. ఒకే స్క్రీన్‌పై స్టార్ హీరోలు.. ఫ్యాన్స్‌కి పండగే

- Advertisement -
- Advertisement -

వెండితెరపై కొన్ని కాంబినేషన్‌లో సినిమాలు చూడాలని ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటారు. ముఖ్యంగా తాము అభిమానించే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమా చేయాలని ప్రతీ అభిమానికి ఉంటుంది. ఇద్దరు స్టార్‌ల కాంబోలో సినిమా వస్తే ఇక ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తారు. అలాంటి సినిమా ఒకటి త్వరలో వెండితెరపై సందడి చేయనుంది. అది కూడా మామూలు హీరోలతో కాదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌లు (Kamal Hassan) కలిసి ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలు నిజమయ్యాయి. త్వరలోనే రజనీకాంత్‌తో (Rajinikanth) కలిసి సినిమా చేస్తున్నానని కమల్‌హాసన్ (Kamal Hassan) అధికారికంగా ప్రకటించారు. ఇటీవల కమల్ సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీతో సినిమాను ప్రకటించారు. ‘‘ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం కలిసి మీ ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది’’ అని కమల్ అన్నారు. దీంతో ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తున్నారని స్పష్టత వచ్చింది.

1979లో వచ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో వీరిద్దరు కలిసి ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఇక కమల్ నటించిన మూడు సినిమాల్లో రజనీ గెస్ట్ పాత్రలో అలరించారు. ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమాక సంబంధించిన వివరాలను మాత్రం కమల్ బయటపెట్టలేదు. మరోవైపు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం కమల్, రజనీలు కలిసి నటిస్తున్నారని పుకార్లు ఉన్నాయి.

Also Read : బాలీవుడ్‌లో లక్కీ ఆఫర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News