Monday, August 18, 2025

ముక్క, చుక్క తక్కువైందని పిఎస్ లో పోలీసుల మధ్య గొడవ?

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: బోనాల పండుగ సందర్భంగా చుక్క, ముక్క తక్కువైందని పోలీస్ స్టేషన్‌లో పోలీసులు గొడవ పడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. కనగల్ లో బోనాల పండుగ సందర్భంగా పోలీస్ సిబ్బందిని కొందరు రాజకీయ నాయకులు విందు, మందులో ముంచేశారు. ముక్కా, చుక్క సరిపడ ఏర్పాటు చేయలేదని పోలీసులు మధ్య గొడవ జరిగింది. అక్కడే మరో స్టేషన్ ఎస్‌ఐ పండుగ సందర్భంగా గొడవ ఎందుకు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పటికే పోలీస్ స్టేషన్ నుంచి అరుపులు ఎక్కువగా రావడంతో చుట్టు పక్కల జనం మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో జరిగింది. దీనిపై ఉన్నత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News