Wednesday, September 10, 2025

బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో మృత్యుగంటలు మోగాయి. కుమారుడు అంగరంగా వైభవంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఉప్పలమ్మ పండుగ సామాను కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గని ఆత్కూరులో శ్రీనివాసరావు(54), రజనీకుమారి(45) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతరుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు.

కుమారుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి ముందు తమ ఇంటి వద్ద ఉపలమ్మ తల్లి పూజా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒగ్గొల్లు పూజారితో మాట్లాడి ఇంటికి వస్తుండగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు సమీపంలో దంపతలులు ప్రయాణిస్తున్న బైక్‌ను కోళ్ల రవాణా వ్యాన్ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందారు. ఎర్రుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News