- Advertisement -
అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎపి డిప్యూటి సిఎం పవన కళ్యాణ్ అలసత్వం వహించలేదని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కందుల దుర్గేష్ వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజాపై ఫైరయ్యారు. ఆమెకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రోజా జబర్దస్త్ లో పాల్గొనలేదానని, జబర్దస్త్ లో అనేక విన్యాసాలు చేసిన రోజా మాట్లాడేందుకు అర్హత ఉందానని ప్రశ్నించారు. పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని, పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ఆమెకు లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు సినిమాలు మాత్రమే ఉన్నాయని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా పవన్ కళ్యాణ్ ను ఎలా విమర్శిస్తారని కందుల దుర్గేష్ నిలదీశారు.
Also Read : విజయవాడలో పెరిగిన డయేరియా కేసులు
- Advertisement -