Wednesday, June 25, 2025

‘కన్నప్ప’ సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’ (Kannappa Movie). ఈ నెల 27వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. 195 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమాని సెన్సార్ బోర్డు 182(3 గంటల 2 నిమిషాలు) నిమిషాలకు కుదించింది. సెన్సార్ బోర్డు సినిమాలో 12 కట్స్ చెప్పింది. అందులో రాబందు ఓ చిన్నారిని పై నుంచి పడేయటం. తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్లు, మూడు పాటల్లోని విజువల్స్‌ని తొలగించారు.

దీంతో సినిమా (Kannappa Movie) విడుదలకు మార్గం సుగమమైంది. ఇక బుధవారం నుంచి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ (తెలుగు) ప్రారంభం అవుతాయని మంచు విష్ణు ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌ బాబు, శరత్ కుమార్, మోహన్‌ లాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. దీంతో 27వ తేదీన సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News