హైదరాబాద్: ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) నేడు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆరు పదుల వయస్సులోనూ యువ హీరోతో పోటీ పడుతూ.. రికార్డులు సాధిస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ నటిస్తున్న సినిమాల్లో ‘కన్నప్ప’ (Kannappa) ఒకటి. ఈ సినిమాలో ఆయన ‘కిరాత’ అనే పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా మోహన్‌లాల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మోహన్‌లాల్ (Mohanlal) గెటప్ హైలైట్‌గా నిలిచింది. చివర్లో మోహన్‌లాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కన్నప్ప (Kannappa) చిత్ర యూనిల్.. ఆయన్ను.. ఒక గొప్ప నటుడిగా, ఆదర్శవంతమైన మనిషిగా, ఆఫ్‌స్క్రీన్‌లో నిజమైన హీరోగా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక కన్నప్ప సినిమా విషయానికొస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు, మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.