రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంతార’. 2022లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ ‘కాంతారా – ఛాప్టర్ 1’ (Kantara Chapter 1) (కాంతారకు పూర్వం జరిగిన కథ) రానుందని చాలా కాలం క్రింద ప్రకటించారు. కానీ, చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా కాంతార – ఛాప్టర్ 1 సినిమా అప్‌డేట్‌ని ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో యోధడిగా రిషబ్ మనకి కనిపిస్తున్నారు.
‘‘ఇతిహాసాలు పుట్టిన చోట గర్జనలు ప్రతిధ్వనిస్తాయి. ‘కాంతార’తో లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ఇది ప్రీక్వెల్. ఈ చిత్రం వెనుక ఉన్న శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పురాణానికి నాంది. హృదయాలను కదిలించే కథకు తిరిగి స్వాగతం’’ అని పోస్టర్‌కి క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ సినిమా (Kantara Chapter 1) విడుదల వాయిదా పడుతుంది అనే వార్తలకు చెక్ పెట్టింది చిత్ర యూనిట్. రిషబ్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కదంబుల కాలంలో జరిగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రిషబ్.