Sunday, August 17, 2025

‘కన్యా కుమారి’ మనసును హత్తుకునే సినిమా

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి మధు శాలిని సమర్పకురాలిగా రూరల్ లవ్ స్టొరీ ‘కన్యా కుమారి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మధు షాలిని మాట్లాడుతూ.. “కన్యాకుమారి టీజర్ చూడగానే నాకు చాలా నచ్చేసింది. గీత్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ లో చాలా అందంగా కనిపించారు. సృజన్ చాలా కష్టపడి ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు”అని అన్నారు.

గీత్ షైని మాట్లాడుతూ “ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే యూనిక్ లవ్ స్టోరీ. వర్షం పడినప్పుడు వచ్చే మట్టి సువాసన అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సినిమా మనసును హత్తుకుంటుంది. ఇందులో కన్యాకుమారి లాంటి పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది”అని తెలియజేశారు. డైరెక్టర్ సృజన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో గీత్ అద్భుతంగా నటించింది. షాలిని ఈ సినిమా చూసి చాలా సపోర్ట్ చేశారు. సినిమాలో రియల్ ఎమోషన్స్ ఉంటాయి. మంచి అనుభూతిని పొందాలంటే కన్యాకుమారి సినిమా చూడాలని కోరుకుంటున్నా”అని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రవీణ్, మ్యూజిక్ డైరెక్టర్ రవి, నరేష్, అప్పలనాయుడు, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News