Tuesday, August 12, 2025

‘కన్యా కుమారి’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి మధు శాలిని సమర్పకురాలిగా రూరల్ లవ్ స్టొరీ ‘కన్యా కుమారి‘ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీచరణ్… గీత్ సైనీని ప్రేమగా ఎత్తుకుంటూ, ఆమె చేతులకు సీతాకోకచిలుక రెక్కలు అలంకరించినట్టుగా డిజైన్ చేయడం ఆకట్టుకుంది. ‘ఆర్గానిక్ ప్రేమ కథ‘ అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో సహజ వాతావరణంలో నడిచే ఈ లైఫ్ ఫీల్ కథ సినిమాటిక్ టచ్‌తో ఒక కొత్త ఫీల్ ని అందించనుంది. పల్లె అందాలు, ఆకట్టుకునే ప్రేమకథ, పండుగ వాతావరణంతో కన్యా కుమారి ఈ సీజన్‌లో మనసులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News