Friday, September 5, 2025

అన్ని సినిమాలు.. ఆ సినిమాల్లా సక్సెస్‌ కాలేవు: కరణ్ జోహార్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్న రెండు సినిమాలు మహావతార్ నరసింహా, సయారా. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేశాయి. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఈ సినిమాలపై కామెంట్ చేశారు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి పెద్ద హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయని ప్రశ్నించారు.

దీనికి ‘‘ప్రతి సినిమా ఫలితం ముందేు రాస పెట్టి ఉందుటంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. కాకపోతే పరిస్తితులుల బాగా లేవు. లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. మరోవైపు కొత్త వారితో తీసిన సినిమాలు కొన్ని సక్సెస్ అయితే.. మరికొన్ని ఫెయిల్ అవుతాయి. సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్‌ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్‌ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు’’ అని కరణ్ జోహార్ (Karan Johar) అన్నారు.

Also Read : రెండో పాట వచ్చేస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News