Friday, August 29, 2025

తొమ్మిది మంది మరణించారనే వార్త అవాస్తవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ కరీంనగర్ క్రైమ్: కరీంనగర్‌లో గణేష్ విగ్రహం కరెంటు తీగలకు తగిలి 9 మంది మరణించారనే వార్త పూర్తి గా అవాస్తవం అని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సోషల్ మీడి యాలో కొందరు వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా ఈ అసత్య వార్తను ప్రచారం చేస్తు న్నారని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఎటువంటి విద్యుత్ ప్రమాదం ఏదీ జరగలే దని స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితం కోరుట్లలో గణేష్ విగ్రహాల తయారీ సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని కొంతమంది ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం వలన అది కరీంనగర్లో జరిగి నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన వివరించారు.ప్రజలందరూ ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గు రిచేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ము ఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో నకిలీ వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News